టార్చి లైట్ వెతురులో బతుకమ్మ ఆడిన ఆడపడుచులు

10-10-2026 | 10:06pm

అంధకారంలో సింగారం బతుకమ్మ ఆట స్థలం

అగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా ఆడపడుచులు

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామం(Singaram village)లో సీతారాముల దేవాలయం ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ(Bathukamma) ఏర్పాట్లను గ్రామపంచాయతీ సిబ్బంది మర్చిపోయారని పలువురు ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేసారు.రాష్ట్ర మంత్రి  సీతక్క ఆదేశాలు స్పష్టంగా ఉన్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చినా కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి  చెప్పుకోండి నాకు ఏటూరు గ్రామపంచాయతీకి సంబంధం లేదని,సమాచారం ఇచ్చిన వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రి సీతక్క ఆదేశాలు ఉన్నాయని కనీసం లైట్ పెట్టమని అడిగినా కూడా మీ దిక్కు ఉన్న కాడ చెప్పుకోండని అన్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరిన్ని వార్తలు