సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా

10-10-2026 | 10:08pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో(Mancherial District) బెల్లంపల్లిలో కరెంట్ కోతలపై(Power cuts) రైతులు కదం తొక్కారు. బెల్లంపల్లి రూరల్ గ్రామాలకు చెందిన రైతులు బెల్లంపల్లి రూరల్ సబ్ స్టేషన్(Bellampalli Rural Substation) ఎదుటఆందోళన చేశారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. బెల్లంపల్లి రూరల్ సబ్ స్టేషన్ ముందు రైతులు(Farmers) బైఠాయించారు. విద్యుత్తు అధికారుల తీరు పై రైతులు మండిపడ్డారు.

పెరకపల్లి, బట్వానపల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం పై అధికారులు అస్సలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లోవోల్టిజి, అంతరాయం పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లు నడుపుకోవడానికి తగిన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన విద్యుత్ అధికారులు వచ్చి హామీ ఇచ్చారు. దీంతో రైతు ఆందోళనను విరమించారు.

మరిన్ని వార్తలు