కందనూల్ జిల్లాలో కరపత్రాల కలకలం.!
- స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరుల బాగోతంపై తీవ్ర సంతృప్తి.
- కరడుకట్టిన కాంగ్రెస్ వాదులను విస్మరించారని మండిపాటు.
- భహిరంగ ప్రదేశాల్లో విసిరేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ నేతల అవినీతి అక్రమాలను ప్రచురించిన కరపత్రాలు బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి(MLC Kuchukulla Damodar Reddy), ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రధాన అనుచరులు ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, అసాంఘీక కార్య కలాపాలను ఎత్తి చూపుతూ కరపత్రంలో ముదరించారు. తన కుమారుడి గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలను అడుక్కున్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారం చేత దిక్కిన తర్వాత కరడు కట్టిన కాంగ్రెస్ వాదులను పూర్తిగా విస్మరించి ఓటమికోసమే పని చేసిన వారిని అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని తెలకపల్లి తాడూరు తిమ్మాజిపేట బిజినపల్లి మండలాల ప్రధాన అనుచరులు నాగనోలు గ్రామానికి చెందిన మరో అనుచరుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఇవన్నీ విషయాలు తెలిసినప్పటికీ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు కరపత్రంలో ముద్రించారు. ప్రస్తుతం కరపత్రాలు సోషల్ మీడియాలో ఆయా కుల సంఘాలు రాజకీయ నేతల స్మార్ట్ ఫోన్లో చక్కర్లు కొడుతుండడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం కాస్త అధికార పార్టీ నేతలకు కూడా తెలియడంతో అంతర్గతంగా విచారణ మొదలైనట్లు తెలుస్తోంది.