టీజీవో బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
ఘనంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి: సీఎస్
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ(Bathukamma) పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో అసోసియేషన్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. టీజీవో మహిళా విభాగం రూపొందించిన బతుకమ్మ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు(Telangana CS Sanjay Jaju) గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక ఐక్యతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ఒక గొప్ప ప్రతీక అని ఈ వేడుకలను ఘనంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వా నికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు, ఉద్యోగిను లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. మహి ళా ఉద్యోగులందరూ బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజీవో మహిళా విభాగం పిలుపునిచ్చింది. పోస్టర్ ఆవిష్కరణలో టీజీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షు లు ఏలూరి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్, మహిళా విభాగం చైర్ పర్స న్ డాక్టర్ జీ దీపారెడ్డి, కన్వీనర్ జే సుజాత, ట్రెజరర్ శాంతి శ్రీ, కిరణ్మయి, పూనం, అనిత, మమత, చంద్రజ్యోతి, వనజ, వివిధ శాఖలకు చెందిన మహిళా గెజిటెడ్ అధికారులు, ఉద్యోగినులు పాల్గొన్నారు.