వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం

09-10-2026 | 11:51am

వాలీబాల్ టైగర్ కప్ పోటీలు

విజేతలకు బహుమతులు, పతకాల ప్రదానం

బాన్సువాడ ఫారెస్ట్ రేంజ్ అధికారీ హబీబ్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ZPHS Government High School)లో శుక్రవారం వన్యప్రాణుల వారోత్సవాలు–2026 సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్టు రేంజ్ అధికారి హబీబ్(Forest Range Officer Habib) పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో వాలీబాల్ టైగర్ కప్ పోటీలను కూడా నిర్వహించారు.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, పతకాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు