తరగతి గదిలో 30 మంది విద్యార్థులపై టీచర్ ఘాతుకం

06-11-2026 | 05:38pm

కంప్యూటర్ వైర్ తెగిపోవడంతో విద్యార్థులపై దాడి

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ బెదిరింపులు

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మండలం(Nagarkurnool Mandal) శ్రీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో(Sripuram ZP High School) విద్యార్థులపై ఉపాధ్యాయుడు దాడికి(Teacher attack) పాల్పడిన ఘటన కలకలం రేపింది. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌లో(Computer Lab) వైర్ తెగిపోవడంతో 30 మంది విద్యార్థులను(Students') బాధ్యులుగా చేస్తూ తరగతి గదిలో బంధించి విచక్షణారహితంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ బెదిరించినట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పుకున్నారు.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా  బయటపడింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గీతారెడ్డి శుక్రవారం పాఠశాల సందర్శించి విద్యార్థులపై దాడిని ఖండించారు. వారి వెంట వెళ్లిన కాంగ్రెస్ నేతలు మాత్రం సదురు ఉపాధ్యాయుడిని వెనుకేసుకొచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ను వివరణ కోరగా దాడి జరిగిన ఘటన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు