తిమ్మాజీపేట దాడి ఘటనపై వినతి
బిజినేపల్లి, అక్టోబర్ 01 : - తిమ్మాజిపేట(Timmajipeta) మండల కేంద్రంలోని ఓ గిరిజన కుటుంబంపై ఆదివారం రాత్రి ప్రతిపక్ష నాయకులు, రౌడీ మూకలు చేసిన దాడి ఘటనపై బిజినేపల్లి మండల గిరిజన నాయకులు(Tribal leaders ) ఖండిస్తూ జిల్లా అధికారులకు గురువారం ఉదయం పిర్యాదు చేశారు. గిరిజనులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి వారికి న్యాయం చేయాలని నాగరుకర్నూల్ జిల్లా గౌరవ ఎస్పీని ఆదివాసి గిరిజన కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ నాయక్ తిమ్మాజీపేట సేవాలాల్ సంఘం అధ్యక్షులు సత్యంనాయక్, నాయకులు శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాల్యా నాయక్, వట్టిపల్లి సర్పంచ్ బధ్యానాయక్, శ్రీనివాస్ నాయక్, భాస్కర్ నాయక్, రాములు నాయక్ ఎస్సీ సెల్ సభ్యులు గుమ్మకొండ రామకృష్ణ తదితరులు కలసి వినతిపత్రం అందజేశారు.