కమ్మేసిన కాలుష్య భూతం
ఢిల్లీలో Air Pollution పీక్స్.. GRAP-3 ఆంక్షలు!
న్యూఢిల్లీ: దీపావళి సంబరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య మేఘాలు(Delhi Air Quality) కమ్మేశాయి. ఆదివారం రాత్రి బాణసంచా కాల్చడంతో Air Quality మరింత దిగజారింది. సాయంత్రం 7 గంటల సమయంలో నగర సగటు Air Quality Index (AQI) 371కి చేరి ‘Very Poor’ కేటగిరీలో నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. జహంగీర్‌పురిలో అత్యధికంగా 460 AQI నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీలోని 59 Pollution Monitoring Stationsలో 19 కేంద్రాల వద్ద గాలి నాణ్యత ‘Severe’ స్థాయికి చేరింది. మరో ఏడు కేంద్రాల్లో ‘Poor’, మిగిలిన 33 కేంద్రాల్లో ‘Very Poor’ కేటగిరీ నమోదైంది. ఆదివారం నగర సగటు AQI 376గా ఉండగా, శనివారం 369గా నమోదైంది. టపాసుల పొగతో పాటు వాహనాల Emissions, హర్యానా, పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టడం (Stubble Burning) కారణంగా సోమవారం కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అమల్లో GRAP-3 ఆంక్షలు
శీతాకాలంలో పెరిగే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ-ఎన్సీఆర్లో నవంబర్ 6 నుంచే Graded Response Action Plan (GRAP) మూడో దశ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. AQI 401 నుంచి 500 మధ్య నమోదైనప్పుడు ఈ దశను అమలు చేస్తారు. ఇందులో భాగంగా Construction and Demolition పనులపై నిషేధం విధించారు. BS-3 Petrol, BS-4 Diesel నాలుగు చక్రాల వాహనాల రాకపోకలపైనా పరిమితులు విధించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే నేరుగా విధులకు హాజరుకావాలని, మిగిలిన వారు Work From Home చేయాలని ఆదేశించారు. నవంబర్ 1 నుంచే వాహనాల ప్రవేశం, నిర్మాణ పనులపై కొన్ని పరిమితులు అమలవుతుండగా.. GRAP-3తో నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యతపై ఆందోళన కొనసాగుతోంది.