దీపావళి సంబరాల్లో అపశ్రుతి
సరోజినీదేవి కంటి ఆస్పత్రికి బాధితులు క్యూ
హైదరాబాద్: దీపావళి సంబరాలు హైదరాబాద్లో పలుచోట్ల ప్రమాదాలకు(Diwali Firecracker Accidents) దారితీశాయి. ఓవైపు బాణసంచా పేలుళ్లతో కంటి గాయాలు.. మరోవైపు నిప్పురవ్వల కారణంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో నగరంలో ఆందోళన నెలకొంది. పండుగ వేళ టపాసులు కాల్చే సమయంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు గాయపడగా, కొన్ని వ్యాపార సముదాయాలు అగ్నికి ఆహుతయ్యాయి.
మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి(Sarojini Devi Eye Hospital) బాధితులు క్యూ కడుతున్నారు. బాణసంచా కాల్చే సమయంలో నిప్పురవ్వలు కళ్లలో పడటంతో పలువురు Eye Injuriesకు గురయ్యారు. ఇప్పటివరకు 40 మంది బాధితులు ఆస్పత్రిలో చేరగా, ఉదయం మరో ఎనిమిది మంది చికిత్స కోసం వచ్చినట్లు వైద్యులు తెలిపారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల నుంచి కూడా బాధితులు వస్తుండటంతో ఆస్పత్రిలో Emergency Cases పెరిగాయి.
ఇదిలా ఉంటే.. బాణసంచా నిప్పురవ్వలు పడి నగరంలోని పలు ప్రాంతాల్లో Fire Accidents సంభవించాయి. కూకట్పల్లి, జీడిమెట్ల, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో షాపులు, గోడౌన్లకు మంటలు అంటుకుని భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదాలపై సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు క్రాకర్స్ కాల్చే సమయంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో గాయపడిన వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఒకవైపు కంటి గాయాలతో సరోజినీదేవి ఆస్పత్రికి, మరోవైపు అగ్నిప్రమాదాలు, బాణసంచా ఘటనల్లో గాయపడిన వారు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకోవడంతో Hospitalsలో బాధితుల సందడి కనిపించింది. పండుగ వేళ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదంగా మారుతుందని ఈ ఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయి.