బుజ్జాయి ఫొటోతో నెట్టింట సందడి
దీపావళి వేళ అభిమానులకు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ అదిరిపోయే Surprise ఇచ్చారు. తమ కుమారుడు విహాన్ కౌశల్ ముఖాన్ని తొలిసారిగా సోషల్ మీడియాలో Reveal చేస్తూ ఫ్యామిలీ ఫొటో షేర్ చేశారు. ఇప్పటివరకు కొడుకు విషయంలో Privacy పాటించిన ఈ స్టార్ కపుల్.. ఈసారి ప్రత్యేక సందర్భంలో తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫొటోలో కత్రినా పసుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించగా, విక్కీ క్రీమ్ కలర్ కుర్తాలో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మధ్యలో తెల్లటి కుర్తా, పసుపు జాకెట్లో ఉన్న చిన్నారి విహాన్ కెమెరా వైపు చూస్తూ చేతులు ఊపుతున్నాడు. అతడి Cute Expressions చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ జీవితంలో ఇదే అత్యంత ఆనందకరమైన దీపావళి అంటూ ఈ జంట భావోద్వేగమైన Caption కూడా జోడించింది.
2021 డిసెంబర్లో వివాహం చేసుకున్న విక్కీ, కత్రినా దంపతులు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉంచేందుకు ఇష్టపడతారు. తాజాగా కుమారుడి ఫొటో బయటకు రావడంతో Social Mediaలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. సోనమ్ కపూర్, కరీనా కపూర్ సహా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ విహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి దీపావళి సందర్భంగా ఈ స్టార్ కపుల్ ఇచ్చిన Surprise అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.