హార్ముజ్‌లో మైన్ బ్లాస్ట్
ఇరాన్: హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మరోసారి యుద్ధ భయాలతో దద్దరిల్లింది. సముద్రంలో అమర్చిన Naval Minesను ఢీకొనడంతో ఒక Oil Tankerలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌక తన Identification Systemsను ఆఫ్ చేసి, నిషేధిత ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. అన్ని ముప్పులు తొలగించే వరకు హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అనుమతి ఉండదని హెచ్చరించింది.
ఇదే సమయంలో ఇరాన్‌కు చెందిన Islamic Revolutionary Guard Corps (IRGC) నేవీ కూడా మరో కీలక ప్రకటన చేసింది. అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తున్న చమురు నౌక సముద్రపు మైన్స్‌ను ఢీకొని పేలుడు సంభవించిందని, దీంతో Vesselలో భారీగా మంటలు చెలరేగాయని తెలిపింది. అదే రోజు ఈ మార్గంలో మైన్స్‌ను ఢీకొన్న మూడో Oil Tanker ఇదేనని పేర్కొంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సముద్ర రవాణా రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
మరోవైపు Gulf of Omanలో అమెరికా సైన్యం ఓ Commercial Vesselను నిలిపివేసినట్లు US Central Command (CENTCOM) వెల్లడించింది. పదేపదే హెచ్చరికలు చేసినా సిబ్బంది పట్టించుకోకుండా Naval Blockadeను ఉల్లంఘించేందుకు ప్రయత్నించారని తెలిపింది. సెయింట్ కిట్స్ జెండాతో ప్రయాణిస్తున్న M/V Huda అనే Cargo Shipను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానం Precision Munitions ప్రయోగించిందని, దీంతో నౌక కదలికలు నిలిచిపోయాయని పేర్కొంది. దాడికి ముందు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల నుంచి సిబ్బంది బయటకు వెళ్లాలని హెచ్చరించినట్లు CENTCOM తెలిపింది.
ఇప్పటివరకు తమ ఆదేశాలను పాటించని వాణిజ్య నౌకలపై చర్యలు తీసుకున్నామని, 147 నౌకలను దారి మళ్లించడంతో పాటు ఐదు Merchant Shipsను నిలిపివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల అనంతరం హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు కఠినతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన లేదా వాటితో సంబంధం ఉన్న నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని నిరాకరించింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇరాన్‌పై Naval Blockade విధించింది. దీంతో కీలకమైన ఈ సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.