మూగజీవాల పట్ల కనికరం చూపాలి

09-11-2026 | 06:56am

మూగజీవాల కోసం మనీషా మంచి పని!

మూగజీవాల పట్ల ప్రేమ ఇంటికే పరిమితం కాకూడదు.. వీధుల్లో ఉండే జంతువులపైనా చూపించాలంటూ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా (Manisha Koirala) పిలుపునిచ్చారు. జంతు సంరక్షణపై అవగాహన పెంచేందుకు నేపాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నేపాల్ ప్రథమ మహిళ సబీనా కాఫ్లేతో కలిసి దిగిన ఫొటోలను Instagramలో షేర్ చేస్తూ ఆసక్తికరమైన సందేశం ఇచ్చారు.

నేపాల్‌లో జరుపుకునే సంప్రదాయ పండుగ కుకుర్ తిహార్ (Kukur Tihar) సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కుక్కలను ప్రేమతో పూజిస్తూ, వాటి పట్ల కృతజ్ఞత చాటుకునే ఈ వేడుకలో భాగం కావడం సంతోషంగా ఉందని మనీషా తెలిపారు. సమాజంలో గొంతు వినిపించలేని మూగజీవాలు మన నుంచి ఎంతో ప్రేమను పొందాల్సిన అవసరం ఉందన్నారు. జంతువుల పట్ల దయ, బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆమె కోరారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల తన తండ్రి 80వ పుట్టినరోజు సందర్భంగా కూడా మనీషా పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన తండ్రి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటం చూసి ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయన పుట్టినరోజు రోజున ఉదయమే 3 కిలోమీటర్లు నడవడంతో పాటు, రోజంతా 12 వేల అడుగులు పూర్తి చేశారని వెల్లడించారు. అంతేకాదు.. 8.5 గంటల నిద్ర, ఉదయం వ్యాయామం కూడా ఆయన Daily Routineలో భాగమని తెలిపారు. 80 ఏళ్ల వయసులోనూ తండ్రి చూపిస్తున్న Fitness Discipline తనకు ఎంతో స్ఫూర్తినిస్తోందని మనీషా భావోద్వేగంగా పంచుకున్నారు.

మరిన్ని వార్తలు