బి.ఎల్. సంతోష్‌ను కలిసిన బాక్రీ
న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్‌ను న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న ‘బీబీ కా ఆలంను బి.ఎల్. సంతోష్‌కు బాక్రీ అందజేశారు.
హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన వారసత్వానికి ప్రతీకగా ‘బీబీ కా ఆలం’కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భేటీ (MEETING)సందర్భంగా ఇరువురూ పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ గుర్తింపును (SYMBOL)గా బి.ఎల్. సంతోష్‌కు అందజేసినట్లు బాక్రీ పేర్కొన్నారు.‘బీబీ కా ఆలం’ హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన (HERITAGE)గా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు (LEADERS) తదితరులు పాల్గొన్నారు