ట్రంప్ రియాక్షన్‌తో కొత్త టెన్షన్
వాషింగ్టన్: రష్యాలో మిస్టరీ డిసీజ్ కలకలం.. ప్లేగు అనుమానాలపై ట్రంప్ రియాక్షన్‌తో కొత్త చర్చ మొదలైంది. సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో Anti-Plague Research Instituteలో పనిచేసిన 28 ఏళ్ల మహిళా ల్యాబ్ వర్కర్ డారియా షిపిలోవా అక్టోబర్ 2న తీవ్ర న్యూమోనియాతో మరణించారు. ఆమె మరణానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోవడం, ఆమె పనిచేసిన సంస్థ ప్లేగు వంటి ప్రమాదకర వ్యాధులపై పరిశోధనలు చేయడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమైంది. అయితే Russia Pneumonic Plague కేసు అధికారికంగా నిర్ధారణ కాలేదు.
ఈ పరిణామాలపై Trump Administration నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ రష్యాలో పరిస్థితిని గమనిస్తున్నామని, అవసరమైతే సహాయం చేస్తామని తెలిపారు. అదే సమయంలో వ్యాధులకు కారణమయ్యే microbes, germs గతంతో పోలిస్తే మరింత బలంగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి Marco Rubio మాత్రం మరింత సమాచారం అవసరమని స్పష్టం చేశారు. రష్యా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రపంచంతో పారదర్శకంగా పంచుకోవాలని కోరారు. ల్యాబ్ వర్కర్ మరణానికి Pneumonic Plague కారణమా? లేక మరో రకమైన pneumoniaనా? అన్నదానిపై ఇంకా పూర్తి స్పష్టత లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు.
మరోవైపు World Health Organization (WHO) కూడా రష్యాను మరిన్ని వివరాలు ఇవ్వాలని కోరుతోంది. మరణించిన వ్యక్తిపై నిర్వహించిన laboratory tests, ఆరోగ్య చర్యలు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలపై WHO సమాచారం అడిగింది. సుమారు 200 మంది contactsను quarantineలో ఉంచినట్లు రష్యా WHOకు తెలిపింది. ప్రస్తుతం విస్తృత స్థాయిలో Plague Outbreak జరిగినట్లు నిర్ధారణ కాలేదు. ఈ ఘటనలో అసలు ఆందోళన కలిగిస్తున్న అంశం transparency. రష్యా అధికారులు ప్లేగు కేసు లేదని చెబుతున్నప్పటికీ, WHOకు ఇంకా పూర్తి సమాచారం అందకపోవడంతో అనుమానాలు కొనసాగుతున్నాయి. COVID-19 సమయంలో ఎదురైన సమాచార లోపాల అనుభవం నేపథ్యంలో ఈసారి ఏదైనా ప్రమాదకర వ్యాధి ఉన్నట్లయితే ముందుగానే గుర్తించడం, సమాచారం పారదర్శకంగా పంచుకోవడం కీలకంగా మారింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరో COVID-19 తరహా మహమ్మారి మొదలైందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు.