ట్యాక్స్‌పేయర్లకు గుడ్ న్యూస్? GSTలో బిగ్ చేంజ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాపారులు, ట్యాక్స్‌పేయర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 57వ GST కౌన్సిల్ సమావేశం నేడు న్యూఢిల్లీలో జరగనుంది. భారత్ మండపంలోని సమ్మిట్ రూమ్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. తొలుత అక్టోబర్ 7న జరగాల్సిన ఈ భేటీని అనివార్య కారణాలతో ఒక రోజు వాయిదా వేసి అక్టోబర్ 8కి మార్చారు. ఈసారి GST reforms, GST compliance, GST registration, tax refunds, Input Tax Credit (ITC) వంటి అంశాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా GST చట్టంలోని కొన్ని నేరాలను decriminalise చేయడం, పన్ను అధికారుల arrest powersపై మార్పులు తీసుకురావడం వంటి ప్రతిపాదనలు కౌన్సిల్ ముందుకు వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన thresholdను పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక వ్యాపారులకు faster GST refunds, సులభమైన GST registration, ITC ప్రక్రియను మరింత streamlined చేయడం, compliance burden తగ్గించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఎగుమతిదారులకు వేగంగా refunds అందించే విధానంపైనా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 57వ GST Council Meeting 2026పై వ్యాపార వర్గాలు, ట్యాక్స్ నిపుణుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తుది నిర్ణయాలు కౌన్సిల్ చర్చల అనంతరం మాత్రమే స్పష్టమవుతాయి.