గ్లోబల్ హీరో పైలెట్ మచ్చర్
- నిన్ను చూసి ప్రపంచం గర్విస్తోంది
- ఫ్లుదుబాయ్ సాహసవీరుడు స్మిత్ మచ్చర్
- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం
- కెప్టెన్ వీరత్వానికి దేశవిదేశాల్లో జేజేలు, పూజలు, సంబురాలు
న్యూఢిల్లీ/ముంబై/దుబాయ్, అక్టోబర్1: ఫ్లైదుబాయ్ విమానం(Flydubai flight)లో తన కోపైలెట్ అ న్యూహ దాడిని వీరోచితంగా పోరాడుతూ.. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి, ప్రతిఘటించి.. 174 మంది ప్రయాణికులను రక్షించిన భార త సంతతి పైలెట్ స్మిత్ మచ్చర్ గ్లోబర్ హీర్ గో నిలిచారు. మరో 9/11 తరహా దాడిని అడ్డుకున్న అతని ధైర్యసాహసాలకు గురువారం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకు న్నారు.
‘నిన్ను చూసి ప్రపంచం గర్విస్తోంది’ అని మచ్చర్‌ను కీర్తిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము(President Droupadi Murmu), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా వివిధ దేశాల అధినేతల నుంచి సాధారణ పౌరుల వరకు ప్రతి గుండే అతని పొగడ్తలతో ప్రతిధ్వనించింది. సోషల్ మీడియాలో హోరెత్తింది. ప్రతిచోటా వీరత్వానికి ప్రతీకగా కీర్తించిం ది. వారణాసి, గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. ముం బైలోని అతని తల్లిదండ్రుల ఇంటి బయట త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని భారీ జనసమూ హం జేజేలు పలుకుతూ సంబురాలు చేసుకుంది.
కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన మచ్చర్, సౌదీ అరేబియాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నా రు. బుధవారం ఆకాశంలో అన్యూహ పరిణామాలు చోటుచేసుకున్న వేళ, ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073 అత్యవసర సంకేతాలు పంపి, 17,000 అడుగులకు పైగా వేగంగా కిందికి దిగి, సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దెల్ అజీజ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండైన విషయం తెలిసిందే.
ఆ విమానంలోని కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణ, రక్తసిక్తమైన మచ్చర్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో, ముంబైలోని ఘట్కోపర్‌కు చెందిన దుబా య్ పైలట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఒక పెద్ద విషాదాన్ని నివారించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన ‘నిస్వార్థ చర్య’, ‘వీరోచిత ధైర్యం’, ‘సమయస్ఫూర్తి’ని ప్రశంసిస్తూ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, ప్రధాన మంత్రి మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు.
ఎంతో మంది ప్రాణాలను కాపాడటంలో ఆయన చూపిన అసా ధారణ ధైర్యాన్ని కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అంద రూ కొనియాడారు. వేలాది మంది ఇతర పైలట్ల మాదిరిగానే ఆయన కూడా నిరాడంబర జీవితం గడిపాడు. కానీ బుధవారం వరకు మచ్చర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఫ్లుటై ఘటన తర్వాత వెబ్‌సైట్లు, సెర్చ్‌ఇంజన్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫుల్ ట్రాఫిక్‌కు గురయ్యాయి. ప్రజలు అతని గురించి జల్లెడ పట్టారు.
అలాగే 2007- వెలింకార్ ఇనిస్టిట్యూట్ నుంచి ఆన్లైన్ మేనేజ్మెంట్ డిగ్రీని అభ్యసించిన మచ్చర్, ఆ -స్కూల్ నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకున్నారు. వెలింకార్ ఇనిస్టిట్యూట్‌లోని వీస్కూల్ డైరెక్టర్ డాక్టర్ పం కజ్ నాటు, అతడిని ఆకాశంలో ఒక నిజమై న హీరోగా అభివర్ణించారు. వెలింకార్ పూర్వ విద్యార్థి ఇంత ఉన్నత శిఖరాలకు ఎదగడం చూసి గర్వంగా ఉందన్నారు.
‘మీ వీరత్వం ఈరోజు లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది. ఆయన ధైర్యం, నిస్వార్థచర్యలు మేము అ మూల్యంగా భావించే విలువలకు నిజమైన నిదర్శనం, అని ఆ విమానయాన సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మచ్ఛర్ ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం సోమనాథ్ ఆలయంలో ఆలయ యాజమాన్యం మహామృత్యుంజ య హోమం చేసింది. కెప్టెన్ తండ్రి, తల్లి, భార్యతో తాను మాట్లాడానని చెప్పారు. ప్రతి భారత హృదయాన్ని స్మిత్ ధైర్యం గర్వంతో నింపుతుందని స్పష్టం చేశారు.
మచ్చర్‌ను కలవడం చాలా ఊరట ఇచ్చింది : భారత రాయబారి
తీవ్ర గాయాలపాలైన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కలిసిన తర్వాత తనకు ‘చాలా ఊరట’ కలిగిందని యూఏఈలోని భారత రాయబారి దీపక్ మిట్టల్(Indian Ambassador Deepak Mittal) తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘ఆరోగ్యంగా ఉండి, కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఏఈ ప్రభుత్వం అందిస్తు న్న మద్దతు, వైద్య సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ.. మిట్టల్ సోషల్ మీడియాలో తెలిపారు. అంతకుముందు ఆయన పైలట్ కుటుంబాన్ని కలిసి, ‘భారతీయ హీరో’ మచ్చర్ సంక్షేమం, ఆరోగ్యం విషయంలో భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
మరో 9/11 తరహా దాడిని అడ్డుకున్నారు: మోదీ
తన ప్రాణాలకు ఏమాత్రం భయపడకుండా ధైర్యసాహసాలతో పోరాడి, మరో 9/11 తరహా దాడిని అడ్డుకున్న భారత సంతతి పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగిస్తూ, కెప్టెన్ మచ్చర్ ప్రపంచానికి అత్యున్నత స్థాయి ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నా లెక్కచేయకుండా కెప్టెన్ మచ్చర్ ధైర్యంగా పోరాడి, మరో 9/11 తరహా దాడి జరగకుండా అడ్డుకున్నారని పీఎంఓ ప్రకటించింది. 140 కోట్ల మంది భారతీయులు కెప్టెన్ మచ్చర్కు సెల్యూట్ చేస్తున్నారని, ఆయన క్షేమం కోసం ప్రార్థిస్తున్నారని మోదీ తెలిపారు.
మచ్చర్ వివేకం అద్భుతం: ట్రంప్
కత్తిపోటుకు గురైన ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రశంసించారు. అతడు ‘చాలా విషమ పరిస్థితిలో’ ఉన్నప్పటికీ, విమానాన్ని కూల్చే ప్రయత్నాన్ని నివారించడంలో సహాయపడేంతటి సమయస్ఫూర్తిని ప్రదర్శించారని ట్రంప్ కొనియాడారు. ట్రంప్ మచ్చర్‌ను ఒక ‘హీరో‘గా కూడా అభివర్ణించారు. ఒమన్కు చెందిన కో-పైలట్ కత్తితో దాడి చేసిన తర్వాత మచ్ఛర్ కాక్పిట్ తలుపు తెరిచి, వెనక్కి పడిపోయి ‘సహాయం కోసం కేకలు వేశాడని’ ట్రంప్ చెప్పారు. పైలట్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. బహు శా ఇప్పటికీ అలాగే ఉందేమో.. కానీ అతనికి ఉన్న వివేకం అద్భుతం. ఒక రకంగా అతను హీరో’ అని ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియాతో తెలిపారు.