మృత్యువుతో పోరాడి బయటపడింది!
10-10-2026 | 05:28pm
మహారాష్ట్రలో ఓ యువతి ప్రమాదం నుంచి తృటిలో బయటపడిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్కూటీపై వెళ్తున్న యువతిని పక్క రోడ్డు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
లారీ ఢీకొట్టిన సమయంలో యువతి కింద పడిపోకుండా లారీ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకుని వేలాడింది. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ సన్నివేశాన్ని చూసిన వారు యువతి ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో ఆమెను నెటిజన్లు ‘సూపర్ ఉమెన్’ (Super Woman) అంటూ అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
इस लड़की की हिम्मत और फुर्ती देखिए...वह स्कूटी से सड़क पर जा रही थी। तभी साइड से एक ट्रक आता है और लड़की के स्कूटी में टक्कर मार देता है। लड़की फुर्ती से स्कूटी छोड़कर ट्रक पकड़कर लटक जाती है...😳😳 #maharashtra #viralvideos #news #accident #cctv https://t.co/GzHNtxyZEU
— Kᴀᴘɪʟ Gᴏᴜʀ (@GaurBulandshahr) October 9, 2026