ఫ్రీ ల్యాప్‌టాప్‌లు

07-11-2026 | 12:27pm

కాలేజీ విద్యార్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్‌లు.. రూ.2,000 కోట్లతో విజయ్ సర్కార్ భారీ పథకం!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(Tamil Nadu Free Laptop Scheme 2026) విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పారు. కాలేజీల్లో చదువుతున్న యువతకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రి ల్యాప్‌టాప్ స్కీమ్’ (Vetri Laptop Scheme) అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏకంగా రూ.2,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకాన్ని వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ Free Laptop Scheme అమలు బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రి విజయ్(Tamil Nadu CM Vijay) పర్యవేక్షించనున్నారు. ఆయన నాయకత్వంలో ప్రత్యేకంగా High-Level Committee ఏర్పాటు చేయనున్నారు. పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియ వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ప్రభుత్వ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం పొందుతున్న Aided Collegesలో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా డిగ్రీ కోర్సుల్లో First Year, Second Year చదువుతున్న UG Studentsతో పాటు Diploma విద్యార్థులకు కూడా ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. మెడిసిన్, అగ్రికల్చర్, లా వంటి పలు కోర్సులు చదివే విద్యార్థులను కూడా ఈ పథకంలో చేర్చారు.

విద్యార్థులకు Digital Education అందుబాటులోకి తీసుకురావడం, Online Learning, Skill Development, పరిశోధనలకు అవసరమైన సాంకేతిక పరికరాలను అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రూ.2,000 కోట్ల భారీ కేటాయింపుతో అమలు కానున్న ఈ పథకం ద్వారా వేలాది మంది కాలేజీ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. అయితే ల్యాప్‌టాప్‌ల పంపిణీ తేదీలు, పూర్తి అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు