లో ఓల్టేజీ సమస్యకు చెక్
నేలపట్లకు 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు!
కూసుమంచి, (విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి 33/11 కేవీ విద్యుత్ Sub Station మంజూరైంది. గ్రామంలో చాలాకాలంగా వేధిస్తున్న Low Voltage సమస్యను పరిష్కరించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకున్నారు. లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు ఇటీవల మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సబ్‌స్టేషన్ మంజూరుకు చర్యలు తీసుకున్నారు. నిర్మాణానికి అవసరమైన ఒక ఎకరం ప్రభుత్వ భూమిని గుర్తించి, సర్వే అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు భూమిని త్వరగా కేటాయించాలని మండల రెవెన్యూ అధికారి సైదులును మంత్రి ఆదేశించారు. సబ్‌స్టేషన్ మంజూరుతో గ్రామంలో విద్యుత్ సమస్యలు తగ్గి, ప్రజలకు మెరుగైన Power Supply అందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నూకలు శోభన్‌బాబు, కాంగ్రెస్ నాయకులు చిలకబత్తిని రామారావు తదితరులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.