ఆడపడుచులకు ఇందిరమ్మ చీరలు.. తేదీ ఖరారు

07-11-2026 | 11:03am

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తెల్ల రేషన్ కార్డు (White Ration Card) కలిగిన కుటుంబాల్లోని మహిళలకు చీరలు అందజేయనున్నారు.

చీరల పంపిణీ బాధ్యతలను పంచాయతీరాజ్, సెర్ప్ (SERP) ఉద్యోగులకు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ (Mobile App) రూపొందించింది. పంపిణీ కేంద్రాల్లో లేదా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అధికారులు చీరలను అందజేయనున్నారు. చీరలు పొందాలనుకునే మహిళలు ఆధార్ కార్డు (Aadhaar Verification) చూపించాల్సి ఉంటుంది. అనంతరం యాప్ ద్వారా ఫొటో తీసి, లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించిన తర్వాత చీరను అందజేస్తారు.

మరిన్ని వార్తలు