గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
గంజాయి విక్రయానికి ప్లాన్.. పోలీసులకు చిక్కిన ఇద్దరు!
రామచంద్రపురం: బీహార్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తూ, లేబర్ క్యాంపుల్లో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను రామచంద్రపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.904 కిలోల గంజాయితో పాటు రెండు Mobile Phones స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఇర్ఫాన్ ఆలం (22), అజహరుద్దీన్ అన్సారీ (22) ఈ నెల 2న బీహార్ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి సుమారు 2 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.
అనంతరం Train ద్వారా హైదరాబాద్‌కు తీసుకొచ్చి, తెల్లాపూర్‌లోని జె.పి. కాలనీలో తమ నివాసంలో ఉంచుకున్నారు. లేబర్ క్యాంపుల్లో పనిచేసే కార్మికులకు గంజాయి విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద ఉన్న నల్లటి బ్యాగును తనిఖీ చేయగా రెండు ప్యాకెట్లలో 1.904 కిలోల గంజాయి లభించింది. గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను పంచనామా ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ Arrest చేసి Remandకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.