రష్యా యుద్ధనౌకను లిబియాలో పేల్చేశాం

24-11-2026 | 05:10am

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటన

న్యూఢిల్లీ, నవంబర్ 23: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో(Russia-Ukraine War) సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌కు 2,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా యుద్ధ నౌకను(Russian warship) ధ్వంసం చేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Ukrainian President Zelenskyy) ప్రకటించారు. లిబియాలోని బెంగాజీ పోర్టులో(Benghazi port) లంగరు వేసిన రష్యా నావికాదళానికి చెందిన ‘మెర్క్యురీ’ యుద్ధ నౌకపై సముద్ర డ్రోన్‌తో దాడి చేసి ముంచేశామని చెప్పారు.

ఈ ఆపరేషన్‌లో రష్యా సైనిక, రవాణాకు ఉపయోగిస్తున్న ఎంవీ అంగారా నౌకను కూడా ధ్వంసం చేసినట్లు జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యాతో సంబంధాలున్న అస్కలాన్ అనే వాణిజ్య నౌక కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ దాడి కారణంగా జరిగిన పేలుడు, అగ్ని ప్రమాదంలో 10 మంది రష్యన్లు, లిబియన్లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఇంతకాలం ఉక్రెయిన్, నల్ల సముద్ర ప్రాంతాలకే పరిమితమైన యుద్ధం ఉత్తర ఆఫ్రికాకూ విస్తరించినట్లయింది. 

మరిన్ని వార్తలు