అమెరికాలో ఘోర విమాన ప్రమాదం

15-10-2026 | 08:55am

అమెరికా: విస్కాన్సిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌక్ కౌంటీ షెరీఫ్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, సింగిల్ ఇంజిన్‌తో కూడిన పైపర్ పీఏ-46 విమానం కెనోషా నుంచి మెనోమోనీకి వెళ్తుండగా డెల్లోనా పట్టణ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం, ఈదురుగాలులు, ఉరుములతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. విమానం కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు ఆధారాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు