మహిళలకు ఆర్థిక స్వావలంబన ముఖ్యం
మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతి రెడ్డి
జూబ్లీహిల్స్లో ఘనంగా ప్రివ్వా కౌచర్ ప్రారంభోత్సవం
హైదరాబాద్, అక్టోబర్ 14(విజయక్రాంతి) : ప్రముఖ ప్రీమియం ఎథ్నిక్ ఫ్యాష న్ బ్రాండ్ ప్రివ్వా కౌచర్ను(Ethnic fashion brand Priva Couture) దామిశెట్టి చందన జూబ్లీహిల్స్లోని(Damishetti Chandana, Jubilee Hills) రోడ్ నంబర్ 36, నీ రూస్ ఎంపోరియో ఎదురుగా ప్రారంభించారు. ఈ బ్రాండ్లో సంప్రదాయ భారతీయ వస్త్రశైలికి(Traditional Indian clothing style) ఆధునిక డిజైన్లను జోడిస్తూ పెళ్లి లంగావోణీలు, బ్రైడల్ లెహంగాలు, డి జైనర్ బ్లౌజులు, డిజైనర్ చీరలు, ఇతర సం ప్రదాయ దుస్తులను అందిస్తున్నారు.ఈ ప్రా రంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్(Malla Reddy University) వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతి రెడ్డి(Preethi Reddy), చందన పారిశ్రామిక స్ఫూర్తి ని, సృజనాత్మకతను అభినందించారు.
సరసమైన ధరల్లో కస్టమర్ల అభిరుచులకు అను గుణంగా ప్రత్యేక దుస్తులను అందించేందు కు ఆమె చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రివ్వా కౌచర్ వ్యవస్థాపకురాలు దామిశెట్టి చందన మాట్లాడుతూ, మేము గత 10 సం వత్సరాలుగా ఈ రంగంలో కొనసాగుతు న్నాం.. పెళ్లి లంగా వోణీలు, బ్రైడల్ లెహంగాలు, డిజైనర్ బ్లౌజులు మా ప్రత్యేకత.. నైపు ణ్యం కలిగిన కళాకారులు, డిజైనర్లు, స్టైలిస్టుల బృందం సహకారంతో ప్రతి కస్టమర్ అభిరుచి, వ్యక్తిగత శైలికి అనుగుణంగా దు స్తులను కస్టమైజ్ చేస్తున్నాం.
స్వచ్ఛమైన కం చిపట్టు, పైఠాణీ, టిష్యూ వంటి నాణ్యమైన వస్త్రాలతో ప్రతి దుస్తును ప్రత్యేక శ్రద్ధతో రూ పొందిస్తున్నాం అని తెలిపారు.సినీ ప్రముఖులు, ఇన్ఫు్లయెన్సర్లు, టెలివిజన్ స్టైలిస్టుల తో పాటు బిగ్బాస్ కంటెస్టెంట్లకు సైతం తమ బ్రాండ్ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను అందిస్తున్నామని చందన వెల్లడించారు. డా. ప్రీతి రెడ్డి మాట్లాడుతూ, మ హిళలు వ్యాపార రంగంలో రాణించేందుకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కుటుంబం అంది స్తున్న సహకారాన్ని ప్రశంసిస్తూ, ప్రివ్వా కౌచర్ విజయవంతం కావాలన్నారు.