కేరళలో ప్రకృతి విపత్తు.. ఐదుగురు మృతి
తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు(Kerala Heavy rains) తీవ్రతరం కావడంతో బురద ప్రవాహాలు, కొండచరియలు(Landslides) విరిగిపడటం, ఆకస్మిక వరదలు(Flash floods) సంభవించాయి.వేర్వేరు జిల్లాల్లో ప్రకృతి విపత్తులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇడుక్కలో షెడ్డుపై కొండచరియలు విరిగిపడి అన్నాచెల్లెలు మృతి చెందారు. మలప్పురం జిల్లాలో నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు గల్లంతయ్యారు.
కొట్టాయంలో(Kottayam) మట్టిపెళ్లలు పడి చెన్నై మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించాలని ముఖ్యమంత్రి వి.డి. సతీశన్(Chief Minister V.D. Satheesan) ఆదేశించారు. సతీశన్ సూచన మేరకు, పరిస్థితిని సమీక్షించేందుకు విపత్తు నిర్వహణ అథారిటీ(Disaster Management Authority) కమిషనర్ విఘ్నేశ్వరి (IAS) ఇడుక్కి, కొట్టాయం జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించినట్లు CMO ఒక ప్రకటనలో తెలిపింది. ఇడుక్కి, కొట్టాయంలో వాతావరణ పరిస్థితులపై ఎస్ఎంఎస్ హెచ్చరికలు జారీ చేయగా, పరిస్థితిని అంచనా వేసి, తరలింపుతో సహా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు.