రేగులకుంట గ్రామంలో ఘనంగా గణేష్ ఊరేగింపు

20-09-2026 | 08:47pm

ములకలపల్లి,సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీ(Jagannadhapuram Gram Panchayat) పరిధిలోని రేగులకుంట గ్రామంలో ఆదివారం గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో గణనాథుడి ఊరేగింపు ఉత్సవ వాతావరణంలో కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజా వినోద్  పాల్గొన్నారు.

గణేష్ లడ్డూ వేలం కార్యక్రమంలో సర్పంచ్ కుంజా వినోద్ వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు.దీంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.గ్రామంలో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో నిర్వాహకులు,భక్తులు,గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు