నూతన కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం
కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు: జితేందర్
మణికొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మణికొండ-నెక్నాంపూర్ 127, 128 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ (Congress Party)నూతనంగా వివిధ పదవులకు ఎన్నికైన నాయకులను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. 127వ డివిజన్ టీపీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగం కిరణ్ కుమార్(Sangam Kiran Kumar), 128వ డివిజన్ అధ్యక్షుడు మెరుగు జితేందర్, 127వ డివిజన్ యూత్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, 128వ డివిజన్ యూత్ అధ్యక్షుడు కస్తూరి శ్రావణ్, మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ఏ-బ్లాక్ అధ్యక్షురాలు ఇందిరలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పురుషోత్తం, ముత్యాలు, ప్రవీణ్, మహేష్ రెడ్డి, అఖిల్ పటేల్, షేక్ హాజీ, కే. శ్రీకాంత్ రెడ్డి, విట్టల్ రెడ్డి, బి. రాములు, నాయుడు శ్రీనివాస్, క్రాంతి కుమార్, ప్రదీప్ రెడ్డి తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.