విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ సినిమా

08-09-2026 | 05:30am

‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం(SR Kalyana Mandapam)‘ చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె(Sridhar Gade) మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఆదిసాయికుమార్‌(Aadi Saikumar)తో ‘చుట్టాలబ్బాయ్’ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో ‘హైవే’ వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి(Venkat Talari) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు(Nandu), లిఖిత(Likhitha) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ చిత్రమిది. ఈ చిత్రానికి డీవోపీ: సతీశ్ రెడ్డి మాసం; సంగీతం: సాయి కార్తీక్; యాక్షన్: దిలీప్; ఎడిటింగ్: శ్రీధర్, వీబీజే; ప్రొడక్షన్ డిజైన్: నాని దేవరపల్లి. 

మరిన్ని వార్తలు