పాదాచారులకు నరకం.. అధికారులు పట్టించుకోరా?

28-09-2026 | 05:20am
  1. మన్నెగూడ ప్రధాన రహదారిపై మురుగు తిష్ట..... 
  2. దుర్వాసనతో అల్లాడుతున్న జనం

ఆదిభట్ల, సెప్టెంబర్ 27(విజయక్రాంతి) ఇబ్రహీంపట్నం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూర్ డివిజన్(Thorrur Division), మన్నెగూడ ప్రధాన రహదారిపై డ్రైనేజీ మురుగునీరు ఏరులై పారు తోంది. రెండు, మూడు ఫంక్షన్ హాళ్లు, అనేక నివాస కాలనీలకు ఏకైక మార్గమైన ఈ రో డ్డుపై నిత్యం వేలాది వాహనాలు, పాదచారు లు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, ఇ క్కడ ఉన్న ‘సుచిరుచి బార్, తెలుగు రుచులు’ హోటల్ వద్ద మురుగునీరు రోడ్డుపైకి ఉ ప్పొంగి, సంపత్ హోమ్స్ ఎదురుగా మన్నెగూడకు వెళ్లే ప్రధాన రహదారిపైకి చేరుతోంది.

రోగాల బారిన పడుతున్న స్థానికులు

రోజురోజుకూ నిలిచిపోతున్న మురుగునీటి వల్ల ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజ ల్లుతోంది. ఇళ్ల ముందే మురుగు నిలవడం తో దోమలు విపరీతంగా పెరిగిపోయి, మలేరియా, డెంగ్యూ వంటి భయంకర రోగాల బారిన పడతామేమోనని స్థానికులు భ యాందోళనకుగురవుతున్నారు.

పలుమార్లు చెప్పినా పట్టింపు లేదు?

సమస్యపై బార్, హోటల్ యాజమాన్యాలతో పాటు స్థానిక మాజీ ప్రజాప్రతినిధి, జీహెచ్‌ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు, నాయకులు నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శాశ్వత పరిష్కారం చూపాల్సిందే

తాత్కాలికంగా నీటిని తోడేయడం కాకుండా, వ్యాపార సముదాయాలకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ముక్కు మూసుకుని బతకాలా?

బార్, హోటల్ నిర్వాహకులకు ప్రత్యేక డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. రోడ్డంతా దుర్వాసన వస్తుండటంతో ఇంట్లో ఉంటే తలుపులు తీయలేకపోతున్నాం, బయటకు రావాలంటే రోత పుడుతోంది. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.

మర్రి రాజు రెడ్డి, స్థానికుడు


మరిన్ని వార్తలు