వికసించిన అరుదైన నాగలింగ పుష్పం
నేరేడుచర్ల, సెప్టెంబర్22(విజయ క్రాంతి):- నాటిన 13 సంవత్సరాల తర్వాత నాగలింగం చెట్టు శివలింగం ఆకారంలో నాగలింగ పుష్పాన్ని పూసిందని యజమాని కట్టా.లవన్ కుమార్ రెడ్డి(Owner Katta. Lavan Kumar Reddy) తెలిపారు.ఈ సంఘటన నేరేడుచర్ల లోని భారత్ గ్యాస్ ఏజెన్సీలో (Bharat Gas Agency)జరిగింది. నాగలింగ పుష్పం ప్రత్యేకత ఏంటి అంటే,పువ్వు మధ్యభాగంలో శివలింగాన్ని పోలిన నిర్మాణం కనిపిస్తుంది. దాని చుట్టూ నాగుపాము పడగను పోలిన ఆకృతి ఉన్నట్లు కనిపించడం వల్ల దీనికి “నాగలింగ పుష్పం” అనే పేరు వచ్చింది.ఈ కారణంగా హిందూ సంప్రదాయంలో దీనికి శివారాధనతో ప్రత్యేక సంబంధం ఉందని భావిస్తారు.ముఖ్యంగా శివాలయాల్లో పూజకు, అలంకరణకు ఈ పుష్పాలను ఉపయోగించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పువ్వు సాధారణ పుష్పాల కంటే చాలా భిన్నంగా, పెద్దదిగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ చెట్టు పుష్పాలు సాధారణంగా కాండం లేదా బలమైన కొమ్మల నుంచి నేరుగా గుత్తులుగా రావడం దీని మరో ప్రత్యేకత.