ముంబై కోస్టల్ రోడ్డుపై ప్రమాదం

21-09-2026 | 05:05am
  1. ఫ్లుఓవర్‌పై నుంచి 75 అడుగుల కిందకు పల్టీలు కొట్టిన బీఎండబ్ల్యూ కారు
  2. ముగ్గురి మృతి, ఒకరి పరిస్థితి విషమం

ముంబై, సెప్టెంబర్ 20: బీఎండబ్ల్యూ కారు(BMW car).. ఆపై మితిమీరిన వేగం.. అదికూడా ఫ్లు ఓవర్‌పై నుంచి.. రయ్..రయ్..మంటూ దూసుకెళ్లింది. దీంతో అదుపుతప్పి 75 అడుగుల కిందన ఉన్న నిర్మాణంలో ఉన్న పార్కింగ్ స్థలం(Parking space)లోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువ కులు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదివారం ఉదయం 5.20 గంటలకు ముంబై(Mumbai)లోని కోస్టల్ రోడ్డుపై జరిగింది. దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్(Marine Drive) నుంచి 10.58 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ ఫ్రీవే అయిన కోస్టల్ రోడ్డుపై హాజీ అలీ వైపు లగ్జరీ కారు వేగంగా వెళ్తోంది.

గుజరాత్ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ కారు, లాలా లజపత్రాయ్ కళాశాల(Lala Lajpat Rai College) ఎదురుగా ఉన్న లోటస్ జెట్టీ సమీపంలో ఆది వారం ఉదయం 5.20 గంటలకు అదుపు తప్పింది. ఫ్లుఓవర్‌ను ఢీకొని గాలిలో ఎగిరి, 75 అడుగుల కింద ఉన్న ఎల్ అండ్ టీ పార్కింగ్ స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనుల ప్రాంతంలోకి పల్టీలు కొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది.

కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షానయ్ గజ్జల్ (21), ఆదిత్య జక్సానియా(19), ధైర్యసేథ్(17) మృతి చెందారని, ఆదిత్య ఓస్వాల్ (23)కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు