స్ఫూర్తి కలిగే ‘బ్లాస్ట్ జోన్’
26-05-2026 12:00 AM
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’. సుభాష్ కే రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. మే 28న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అర్జున్ సర్జా మాట్లాడుతూ.. “ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలో ‘బ్లాస్ట్ జోన్’లో చూపించాం” అన్నారు. దర్శకుడు సుభాష్ కే రాజ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా అర్జున్ అభిమానులకు ఒక ట్రీట్‌లా ఉంటుంది” తెలిపారు. కార్యక్రమంలో అభిరామి, ప్రీతి ముకుందన్ పాల్గొన్నారు.






