28 July, 2026 | 7:15 PM

మండల అభివృద్ధిపై సమీక్ష

28-07-2026 06:44 PM

అధికారులకు ప్రత్యేక అధికారిణి ఆదేశాలు

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని రైతువేదికలో మండల స్పెషల్ ఆఫీసర్, ఐటీడీఏ భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన ఆధ్వర్యంలో మంగళవారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ముత్యాలరావు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్‌లు పాల్గొన్నారు.