4 September, 2026 | 5:42 AM

నా డాక్టర్ చదువు.. నటిగా నాలో పరిణతిని తెచ్చింది!

04-09-2026 | 05:00am

యువ కథానాయకి శ్రీలీల(Actress Sreeleela) ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఓ రొమాంటిక్ మ్యూజికల్ లవ్‌స్ట్టోరీలో హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాతోనే హిందీలోకి అడుగుపెడుతోందీ భామ. అటు తమిళంలో స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబోలో రానున్న ‘ఓమ్’ సి నిమాలోనూ శ్రీలీలే హీరోయిన్. ఇలా వరుస షూటింగ్స్, బిజీ షెడ్యూ ల్స్ మధ్య ఉన్న శ్రీలీల తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైద్య విద్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

“నేను చేసిన వైద్య విద్య, హాస్పిటల్ పోస్టింగ్‌లో అనుభవాలు నటిగా నా ఆలోచనా వి ధానాన్ని ఎంతో తీర్చిదిద్దాయి. సినిమా రంగానికి అతీతంగా నిజ జీవితంలో నేను పొందిన అనుభవాలు వైవిధ్యమైన పా త్రలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఆసుపత్రిలో పనిచేసే సమయంలో ప్రతిరోజూ పేషెంట్ల జీవితం, మర ణం, వారి కు టుంబాలు పడే ఆర్థిక ఇబ్బందులు, మానసిక పోరాటాలను కళ్లారా చూ శాను. రోజూ ఎంతో మంది నిజజీవిత కథలను చూడటం వల్ల ప్రపంచాన్ని, మనుషుల భావోద్వేగాలను చూసే నాఆలోచనా విధా నం పూర్తిగా మారిపోయింది అని తెలిపింది శ్రీలీల.