అత్యంత ధనవంతుడు అదానీ
- అంబానీని వెనక్కి నెట్టి తొలి సంపన్నుడిగా రికార్డు
- 2026 ఎం3ఎం హురూన్ ఇండియా రిచెస్ట్ జాబితా విడుదల
- అదానీ 9.23 లక్షల కోట్లతో ఫస్ట్, అంబానీ 8.63 లక్షలతో సెకండ్
- ఐదేళ్లలో భారత్‌లో 154కు పెరిగిన బిలినీర్ల సంఖ్య
- 1,810మంది సంపన్నుల చేతుల్లో 187.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారతదేశం(India)లో అత్యంత ధనవంతుడి లిస్ట్‌లో గౌతమ్ అదానీ(Gautam Adani) (అదానీ గ్రూప్) ముందువరుసలో ఉన్నారు. ముఖేష్ అంబానీ(Mukesh Ambani)ని వెనక్కి నెట్టి ఆయన తన తొలి సంపన్న స్థానాన్ని పదిలం చేసుకున్నారు. బుధవారం ‘ఎం3ఎం హురూన్ ఇండియా రిచ్ లిస్ట్(M3M Hurun India Rich List) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అదానీ సంపద 13 శాతం పెరిగి రూ. 9.23 లక్షలకు చేరింది.
రోష్నీ నాడార్ అత్యంత ధనవంతురాలైన మహిళాగా నిలిచింది. ముఖేష్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్) సంపద 10 శాతం తగ్గి రూ. 8.63 లక్షల కోట్లకు పడిపోయి రెండోస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారిలో 1,810 మంది ప్రముఖులున్నాయి. వీరి సంపద విలువ మొత్తం రూ. 187.5 లక్షల కోట్లకు చేరుకుంది. కాగా ఈసారి మహిళల భాగస్వామ్యం పెరిగింది.
జాబితాలో 131 మంది మహిళలున్నారు. మూడోస్థానంలో ఎల్‌ఎన్ మిత్తల్ (ఆర్సెల్లర్ మిత్తల్) రూ. 3.39 లక్షల కోట్లు, నాలుగో స్థానంలో పూనావాలా (సిరిమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కుటుంబం రూ. 3.03 లక్షల కోట్లు, రూ. 2.79 లక్షల కోట్లతో రోష్ని నాడార్ మల్హోత్రా (హెచ్‌సీఎల్) కుటుంబం, ఆరో స్థానంలో రూ. 2.69 లక్షల కోట్లతో కుమార మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్), ఏడో స్థానంలో దిలీప్ సింఘ్వీ (సన్ ఫార్మా) రూ. 2.65 లక్షల కోట్లు, 8వ స్థానంలో అజీమ్ ప్రేమ్ (విప్రో) జీ రూ. 2.63 లక్షల కోట్లు, 9వ స్థానంలో అనిల్ అగర్వాల్ (వేదాంత రిసోర్సెస్) రూ. 2.08 లక్షల కోట్లు, 10వ స్థానంలో సమీర్ మెహతా (టొరెంట్ ఫార్మా) రూ. 1.89 లక్షల కోట్లతో ఉన్నారు. భారతదేశంలో గత ఐదేళ్లలో బిలియనీర్ల సంఖ్య 154కు పెరిగింది. భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 391కి చేరింది. ఎక్కువ సంపద కలిగిన 465 మంది ముంబైలో నివసిస్తుండగా, 236 మంది న్యూఢిల్లీలో, 129 మంది బెంగళూరులో నివసిస్తున్నారు.