ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

03-10-2026 | 06:27pm

విద్య బోధన, మధ్యాహ్న భోజనంపై ఆరా

ఆదిలాబాద్,(విజయక్రాంతి): గుడిహత్నూర్ మండలం(Gudihatnur Mandal) వైజాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక, ప్రీ-ప్రైమరీ పాఠశాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధనా విధానం, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యతను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం చిన్నారులతో సరదాగా ముచ్చటించి వారి విద్యా నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నతనంలోనే పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చని వెల్లడించారు. ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేసి నాణ్యమైన విద్యాబోధన అందించాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. తనిఖీల్లో  ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కోటే, డీఎంహెచ్‌ఓ సాధన, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత, స్థానిక సర్పంచ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు