ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
కుబీర్ (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలోని(Nirmal District) బాసర బైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డైరెక్టర్ ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, హైదరాబాద్ డాక్టర్ రవీంద్ర నాయక్(Dr. Ravindra Naik, Hyderabad) గారు ఈరోజు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Urban Primary Health Center) ఆకస్మికంగా తనిఖీ(Surprise inspection) చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఔషధాల లభ్యత, రోగుల నమోదు, సిబ్బంది హాజరు, ల్యాబొరేటరీ పరీక్షలు, మాతా శిశు ఆరోగ్య సేవలు, టీకా కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ, ఎన్‌సీడీ (అసాంక్రమిక వ్యాధులు) స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు.
అనంతరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ గారు కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ సౌమ్య, డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్ వైద్యాధికారి అయేషా డాక్టర్ కమలేష్ , ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.