అంగన్వాడీలో లభించే సేవలను వినియోగించుకోవాలి

03-10-2026 | 07:28pm

కొడిమ్యాల,అక్టోబర్ 3 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండలం సూరంపేట అంగన్వాడి కేంద్రంలో(Surampet Anganwadi Centre) ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు(ICDS Malyala Project) ఆధ్వర్యంలో సూరంపేట సర్పంచ్ గంగవ్వ  అధ్యక్షతన పోషణ మాసం కార్యక్రమం(Nutrition Month Program) ఏర్పాటు చేసుకోవడం జరిగింది.  సర్పంచ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు  అంగన్వాడిలో లభించే సేవలను వినియోగించుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు సిడిపిఓ వీరలక్ష్మి తల్లుల నుద్దేశించి మాట్లాడుతూ... ప్రతి గర్భిణీ బాలింత సెంటర్ వచ్చి అంగన్వాడీ కేంద్రంలోని అనుబంధ పోషకాహారం తిని వెళ్ళవలసిందిగా సూచించారు.

వారు తినే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్లలో దొరుకుతాయి. ఒక పూట భోజనం అంగన్వాడిలోనే భుజించాలని తెలియజేయడం జరిగింది.  పిల్లలకు రోజుకు ఒక కోడిగుడ్డు బాలామృతమును తినిపించాలి. పిల్లల్లో లోప పోషణ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు వయసుకు తగ్గ బరువు ఎత్తుకు తగ్గ బరువు ఉండడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సెక్టర్ సూపర్వైజర్ ఉమా,   సదయ్య,సరోజన,స్వప్న, లక్ష్మి, మంజుల,వసంత, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు హాజరు కావడం జరిగింది.

మరిన్ని వార్తలు