2 May, 2026 | 4:13 AM

కలకత్తా డాక్టర్ రేప్ మర్డర్ నేపథ్యంలో..

02-05-2026 03:05 AM

మలయాళ స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘హంట్’. తెలుగులో ‘డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్’ అనే పేరుతో అనువాదమవుతోంది. దర్శకుడు షాజీ కైలాస్.. సంచలన ఘటన కలకత్తా డాక్టర్ రేప్ మర్డర్ నేపథ్యంగా తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో మే 8న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా, నటి కవిత, నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథరెడ్డి, లయన్ సాయివెంకట్, లీగల్ అడ్వొకేట్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కైలాస్ మీనన్; సినిమాటోగ్రఫీ: జాక్సన్ జాన్సన్; ఎడిటింగ్: అజాస్ పుక్కడన్.