27 August, 2026 | 9:08 PM

విద్యార్థుల దుస్తుల తయారీ పనుల్లో నాణ్యత పరిశీలన

27-08-2026 02:04 PM

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 27 (విజయ క్రాంతి): స్థానికంగా మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుస్తుల తయారీ పనులను ఎంఈఓ వెంకట్ రెడ్డి పరిశీలించారు.గురువారం  ఐకెపి ఏపియం దత్తుతో కలిసి పాఠశాల విద్యార్థుల దుస్తుల కుట్టు కేంద్రాలను సందర్శించి నాణ్యత పరిశీలన చేసిన ఎంఈఓ వెంకటరెడ్డి ఈ సందర్భంగా తయారు చేస్తున్న దుస్తుల నాణ్యత, కుట్టు పనితీరు, కొలతలు,ఫినిషింగ్ తదితర అంశాలను పరిశీలించారు.

పాఠశాల విద్యార్థుల దుస్తుల కుట్టు పనిలో కొలతలు,కుట్టు నాణ్యత,ఫినిషింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు అందించడం ద్వారా మరింత మంచి గుర్తింపు పొందవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐకెపి అకౌంటెంట్ రాజు,సిఆర్పి రాజు,మహిళా సభ్యులు పాల్గొన్నారు.