విజయవంతంగా ముగిసిన ఎజిఎఫ్ మండల స్థాయి క్రీడలు

22-09-2026 | 11:52pm

విజేతలకు బహుమతి ప్రధానం

కొడిమ్యాల, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండలం కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ బహుమతులను అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.... జిల్లా స్థాయిలో రాణించి కొడిమ్యాల మండలానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఎంఈఓ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బూట్ల రాజామల్లయ్య,కార్యదర్శి నివేదిక సమర్పించారు. 

ఈ సందర్భంగా మండల పోటీల నిర్వహణకు  సహకరించి బహుమతులను అందజేసిన ఇండో స్కూల్ కరస్పాండెంట్ బాబీ జోసెఫ్ కు కన్వీనర్ ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్ జి ఎఫ్) జిల్లా కన్వీనర్ టి.చక్రధర్ రావు మాట్లాడుతూ.. ఎస్జిఎఫ్ మండల స్థాయి పోటీల నిర్వహణలో కొడిమ్యాల మండలం చక్కగా నిర్వహించిందని అభినందించారు. 3 రోజుల నుండి ఉత్సాహంగా  జరుగుతున్న వాలీబాల్, కోకో,కబడ్డీ అథ్లెటిక్స్ లో గెలిచిన అండర్ 14,17 బాల బాలికలకు కప్ లతో  పాటుగా బంగారు,వెండి పతకాలను అందజేశారు.  కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి టి.చక్రధర్ రావు, ఒడ్నాల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ గోపాల్, మండల కన్వీనర్ బూట్ల రాజమల్లయ్య,లక్ష్మీ రామ్  నాయక్, ఏనుగు ఆదిరెడ్డి, పిఆర్టియు నాయకులు, ఫిజికల్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు