ఏఐ+ నోవా 2 పవర్ 5జీ ఫోన్ ఆవిష్కరణ

22-09-2026 | 10:22pm

న్యూఢిల్లీ: ఏఐ+ స్మార్ట్‌ఫోన్(AI+ Smartphone), తన నోవా 2 సిరీస్‌లో భాగాంగా, తాజా స్మార్ట్‌ఫోన్ అయిన నోవా 2 పవర్ 5Gని లాంచ్‌ చేసింది. అత్యాధునిక డిజైన్, విశ్వసనీయమైన పనితీరు, ఎక్కువకాలం నిలిచే బ్యాటరీ పవర్‌ను కలిపి, టెక్నాలజీపై ఆసక్తి ఉన్న కొత్త తరం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు.

సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లకు భిన్నంగా, ఫ్యాషన్ మరియు టెక్నాలజీల అద్భుత సమ్మేళనాన్ని ప్రదర్శిస్తూ, నోవా 2 పవర్ న్యూఢిల్లీలోని రన్‌వేపై ఆవిష్కరించారు. ఈ ఫోన్‌ను ఆధునిక రన్‌వే లుక్స్‌తో సమన్వయం చేసి ప్రదర్శించడం ద్వారా, ఇది కేవలం ఒక టెక్నాలజీ పరికరం మాత్రమే కాకుండా స్టైలిష్ యాక్సెసరీగా కూడా ఉంటుందనే భావనను హైలైట్ చేశారు.

"స్ఫూర్తినిచ్చే డిజైన్. ఎక్కువకాలం నిలిచే పవర్," అనే మంత్రంతో రూపొందించిన నోవా 2 పవర్‌లో, స్మార్ట్‌ఫోన్ అనుభవంలో డిజైన్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, వినియోగదారులు కోరుకునే పనితీరు మరియు మన్నికను అందించారు.స్మార్ట్‌ఫోన్‌లు వ్యక్తిగత గుర్తింపులో భాగంగా మారుతున్న నేపథ్యంలో, నోవా 2 పవర్‌ కేవలం పనితీరుకే పరిమితం కాకుండా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే పరికరంగా నిలుస్తుంది. డిజైన్, ఆకాంక్ష మరియు టెక్నాలజీల కలిసే కేంద్రంగా స్మార్ట్‌ఫోన్‌ను నిలపాలనే ఏఐ+ స్మార్ట్‌ఫోన్ దార్శనికతను ఈ రన్‌వే ప్రదర్శన హైలైట్ చేస్తుంది.

ఈ ఫోన్‌ ముఖ్య ఫీచర్లలో ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ బ్యాక్ ప్యానెల్ ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ బ్యాక్ ప్యానెల్ ఒకటి. ఇది కలర్ ఫ్యూజన్ ఫినిషింగ్స్‌లో లభిస్తుంది: బ్లూ గోల్డ్ ఫ్యూజన్ మరియు బ్లూ ఫ్యూజన్‌తో పాటు, ఓషన్ గ్రీన్, డీప్ పర్పుల్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ రంగులలో కూడా అందుబాటులో ఉంది. కాంతి పడే విధానాన్ని బట్టి ప్రతి రంగు ప్రత్యేకంగా మెరుస్తూ, ఒక ప్రత్యేకమైన శోభను జోడిస్తుంది.

ఈ రోజుల్లో, టెక్నాలజీ అనేది వ్యక్తిగతమైనది. ఒక స్మార్ట్‌ఫోన్ కేవలం ఫంక్షనల్ పరికరం మాత్రమే కాదు; అది వ్యక్తులు తమను తాము వ్యక్తీకరించుకునే ఒక సాధనం. నోవా 2 పవర్‌లో డిజైన్‌తో పాటు పనితీరుకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చామనీ. నెక్ట్స్‌క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్  సీఈఓ మాధవ్ షెత్  అన్నారు.

మరిన్ని వార్తలు