ఫ్యాషన్ వీక్‌లో నీలికళ్ల సుందరి
29-09-2026 | 01:30pm
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) పారిస్ ఫ్యాషన్ వీక్‌లో తన అందంతో సందడి చేశారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్‌లో సిల్వర్ క్రౌన్, బ్లాక్ గౌన్‌లో ఆమె తళుక్కుమన్నారు. హుందాతనం, రాజసంతో కూడిన నడకతో ఐశ్వర్య ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి: ములుగులో ‘ప్యారడైజ్’ టీమ్
నీలి కళ్ల సుందరి లుక్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెను క్వీన్‌తో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న ఐశ్వర్య.. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.