2 June, 2026 | 5:37 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు ఆసిఫ్ అలీకి అరుదైన గుర్తింపు   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయం   •   తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్   •   పార్లమెంట్‌లో నాటి 39 మంది బీఎస్పీ ఎంపీల మద్దతు వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం   •   తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సోనియా గాంధీ కృషి వల్లనే రాష్ట్రం ఏర్పాటు.   •   చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   ముఖ్యమంత్రి ప్రసంగం జిల్లా ప్రజలకు నిరాశ కలిగించింది   •   పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   నాగిరెడ్డిపేట్ మండలంలోని అన్ని జిపిలలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు   •   జెండా కోసం గొడవ.. వేడుకల్లో అపశృతి   •  

ప్రైవేట్ బిల్లును అనుమతించండి

24-03-2026 01:02 AM
  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  2. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు నోటీసు అందజేత

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్ట బద్ధత కల్పించాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో శాసనసభ కార్యదర్శికి ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును బీఆర్‌ఎస్ నేతల బృందం అందజేసింది.

అనంతరం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు అంద జేశారు. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే వీలు కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు.