18 April, 2026 | 12:20 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ఆర్పీఐ(ఎ) ఆద్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 05:26 PM

మందమర్రి (విజయక్రాంతి): ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను ఆర్పిఐ(ఎ) పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో సోమ వారం ఆర్పిఐ(ఎ) జిల్లా అధ్యక్షులు గుడికందుల తిరుపతి, ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. డి. రహమత్ ఖాన్ లు  అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు.

దేశ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులు, భావితరాలకు, బంగారు బాటలు వేసి, ప్రజలకు మార్గదర్శకాలు రచించిన, మహనీయులు అంబేద్కర్ అని ఆయన సేవలను వారు కొనియాడారు, నిరుపేద కుటుంబంలో జన్మించి  ఉన్నత చదువులు చదివి అంటరాని తనాన్ని రూపుమాపడమే కాకుండా కుల నిర్మూలన నా అంతమయ్యేలా పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలంతా ఏకతాటిపై నిలబడి రాజ్యాంగాన్ని కాపాడు కోవా లని  వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఐ(ఎ)జిల్లా ఇన్చార్జ్ పులిపాక శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, ఎండి యాకుబ్, జిల్లా కార్యదర్శి భారతపు తిరుపతి, సీనియర్ నాయ కులు, కర్రావుల బానేష్, శంకర్ లు పాల్గొన్నారు.