రాజ్యాంగబద్ధ హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎంతో కీలకం
ఘట్ కేసర్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : రాజ్యాంగబద్ధ హక్కుల కోసం అంబేద్కర్(Ambedkar) చేసిన కృషి ఎంతో కీలకమైనదని పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు గణేష్ యాదవ్ (Congress Party Working President Mettu Ganesh Yadav) అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 284వవారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్యఅతిథిగా మెట్టు గణేష్ యాదవ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గణేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు అగ్రవర్ణాల్లోని అనేక మంది నేడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన పోరాటాలను కొనియాడారు.
మహిళలకు సమాన హక్కులు, ఓటు హక్కు, భారత రాజ్యాంగ నిర్మాణం, కార్మికుల హక్కులు, సామాజిక న్యాయం, రిజర్వేషన్లకు రాజ్యాంగ పరిరక్షణ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంస్థాగత సంస్కరణలు ఇలా ఆయన చేసిన అనేక మహత్తర కృషి భారత సమాజంపై చెరగని ముద్ర వేసింది. ఆయన ఆలోచనలు, పోరాటాల ఫలితాలను గుర్తించి గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని చెప్పారు. ఇలా ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు కె. నర్సింగ్ రావు, బండారి రాందాస్, కడుపోళ్ల బిక్షపతి, కె. సత్యం, మంచాల విజయ్ కుమార్, మీసాల బాబు, జి. అంజయ్య, శివకృష్ణ, మీసాల వంశీ, జి. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.