మదింపు జరగాల్సిందే!
02-03-2026 01:54 AM
కవి తన మనసును మదిస్తేనే
మహాకావ్యం పుడుతుంది !
మానవాళిని మదిస్తేనే
చరిత్ర ఒక యుగ పురుషుణ్ణి
చూస్తుంది !
పుడమి గర్భం నుంచి
మొలకెత్తాలంటే..
విత్తనం ఎంత పోరాటం చేస్తుందో తెలుసా?
మట్టిలో అట్టుడికి, నీటిలో నాని
చివరకు రెండుగా చీలి
మట్టిని చీల్చుకుని మొక్క పుడుతుంది!
అలాంటి మొక్కలన్నీ
కలిసే ఒక వనం ఏర్పడుతుంది !
చరిత్ర ఎప్పుడూ పోరాటాన్నే
గుర్తు పెట్టుకుంటుంది..
మనం పుట్టామా.. చచ్చామా.. అన్నది కాదు!
యువతా.. మేలుకో.
ఓటమి వచ్చిందని మగ్గిపోవద్దు..
ఓటమిని అంగీకరించు.. చతికిలపడొద్దు
మళ్లీ లే.. కాలం నీకు మరొక అవకాశం ఇస్తుంది..
విజయం పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతుంది !
- కందాళ పద్మావతి




