జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని కలెక్టర్ కు వినతి
బీసీ సంక్షేమ అనుబంధ సంఘ నాయకులు
ముకరంపుర , జూన్ 24(విజయక్రాంతి): జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీని ప్రైవేట్ పాఠశాలలు ఇవ్వడం లేదు వెంటనే 100% రాయితీలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను బీసీ సంక్షేమ సంఘం నాయకులు దొగ్గలి శ్రీధర్ , బీసీ యువజన సంఘం నాయకులు మాదాసు , సంజీవ్ , బీసీ విద్యార్థి సంఘం నాయకులు కుటుంబ ఆదర్శ్ కలిశారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల పిల్లలకు పూర్తి ఉచిత విద్యను అందించాలని ఆదేశాలు జారీ చేసిన దానికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు కానీ ప్రైవేట్ పాఠశాలలు పూర్తిస్థాయిలో ఫీజు మాఫీ చేయడం సాధ్యం కాదని 10 నుండి 20% మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఎంతైనా అవసరం ఉంది కావున పూర్తిస్థాయి ఫీజులు మాఫీ చేసే విధంగా తమరు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది.






