24 May, 2026 | 2:12 PM

Breaking News

భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

బీజేపీ జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షల వెల్లువ

23-03-2025 12:00 AM

రాజేంద్రనగర్, మార్చి 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా బిజెపి రూరల్ అధ్యక్షుడు రాజ్ భూపాల్ రెడ్డికి శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందేల శ్రీరాములు పార్టీ నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో  సన్మానిస్తూ హృదయపూర్వక శుభా కాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అందరం కలిసి సమన్వయంతో పార్టీని విజయపతంలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.