4 September, 2026 | 11:23 AM

జాతీయ రహదారిపై బస్సు ప్రమాదం

04-09-2026 | 10:18am

 33 మంది ప్రయాణికులు సురక్షితం

బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన

అనంతపురం: ఏపీలోని అనంతపురం(Anantapur Bus Fire) జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ పర్యాటక బస్సులో మంటలు(Bus Fire) చెలరేగడంతో, అందులోని 33 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు(Bangalore to Hyderabad) వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.

మంటలను గమనించిన డ్రైవర్, ప్రయాణికులను కిందకు దిగమని హెచ్చరించాడు. మంటలు బస్సు మొత్తాన్ని వ్యాపించకముందే ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగగలిగారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక వాహనం(Fire engine) ఘటనా స్థలానికి చేరుకుని, గంటలోపే మంటలను ఆర్పేసింది. ఈ ఘటనకు గల కారణాన్ని నిర్ధారించేందుకు డ్రైవర్ నుంచి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు అంటుకున్నాయని తెలిపారు.